Kim Jong Un: రెండో కొరియన్ యుద్ధం జరగకపోవచ్చు: కిమ్ నోటి వెంట శాంతి వచనాలు

Second Korean war may not happen says Kim Jong Un
  • మన జోలికి ఎవరు వచ్చినా చూస్తూ ఊరుకోం
  • ఇప్పుడు సరిహద్దు సమస్యలను దౌత్య మార్గంలోనే పరిష్కరించుకునే యత్నాలు జరుగుతున్నాయి
  • దేశాల వద్ద అణ్వస్త్రాలు ఉండటమే దీనికి కారణం

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అంటేనే... ఎప్పుడూ అణ్వాయుధాల పరీక్షలు, ఇతర దేశాలతో కయ్యానికి కాలుదువ్వడం వంటివి గుర్తొస్తాయి. అమెరికా, దక్షిణకొరియా, జపాన్ దేశాల మీద ఎప్పుడూ విరుచుకుపడటం కిమ్ నైజం. అలాంటి కిమ్ ఇప్పుడు శాంతి వచనాలు పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొరియా యుద్ధం ముగిసి ఇప్పటికి సరిగ్గా 67 సంవత్సరాలు  అయింది. ఈ నేపథ్యంలో నిన్న 67వ వార్షికోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ ఆర్మీ అధికారులతో కిమ్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ, మన దేశం అణ్వాయుధ దేశామని... మన జోలికి ఎవరు వచ్చినా చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. అయితే, ఇప్పుడు అన్ని దేశాలు సరిహద్దు సమస్యలను దౌత్య మార్గంలోనే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. అత్యాధునిక అణ్వాయుధాలు, అణ్వస్త్రాలను కలిగి ఉండటమే దీనికి కారణమని చెప్పారు. ఇప్పట్లో రెండో కొరియన్ యుద్ధం జరిగే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.

మరోవైపు ఉత్తర కొరియాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడూ క్షిపణి పరీక్షలతో దద్దరిల్లే కొరియా... అభివృద్ధిపై దృష్టి సారించింది. పరిశ్రమలను స్థాపిస్తోంది. అంతేకాదు, దేశంలో జరుగుతున్న విషయాలను బయటి ప్రపంచానికి ప్రకటిస్తోంది.

  • Loading...

More Telugu News