EPFO: ఈపీఎఫ్‌ఓ నుంచి కోట్లాది రూపాయలు విత్‌ డ్రా చేసుకుంటోన్న ఉద్యోగులు

  • కరోనా సంక్షోభం కారణంగా నగదు ఉపసంహరణ
  • ఏప్రిల్‌ నుంచి మొత్తం రూ.30 వేల కోట్ల నగదు విత్‌డ్రా
  • విత్‌ డ్రాకే మొగ్గుచూపిన 80 లక్షల మంది చందాదారులు
  • ఈపీఎఫ్‌ఓ పరిధిలో 6 కోట్ల మంది చందాదారులు 
epfo withdraws by employees

కరోనా సంక్షోభం కారణంగా ఉద్యోగులు పనిదినాలను నష్టపోవడం, జీతాల్లో కోత, సంస్థల నుంచి జీతాల చెల్లింపుల్లో జాప్యం, వైద్య ఖర్చులకు డబ్బులు అవసరం పడడం వంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆదాయం తగ్గిపోవడంతో ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌ఓ) నుంచి పెద్ద మొత్తంలో డబ్బును ఉపసంహరించుకున్నారు.

ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు మొత్తం 80 లక్షల మంది చందాదారులు రూ.30 వేల కోట్ల నగదును విత్‌డ్రా చేసుకున్నారు. ఈపీఎఫ్‌ఓ పరిధిలో మొత్తం దాదాపు 6 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. లాక్‌డౌన్‌ విధింపు ప్రారంభ నెలల్లో ప్రత్యేక సౌలభ్యం ద్వారా సుమారు 30 లక్షల మంది రూ.8 వేల కోట్లను, తర్వాత మరికొందరు సాధారణ నగదు విత్‌డ్రా రూపంలో రూ.22వేల కోట్లను తీసుకున్నారు. సమీప భవిష్యత్తులో ఈపీఎఫ్‌ నుంచి విత్‌డ్రా చేసుకోనే వారి సంఖ్య కోటికి చేరుకోవచ్చని అంచనా.

More Telugu News