Kanna Lakshminarayana: నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు: కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana thanked every one
  • ఏపీ బీజేపీ కొత్త చీఫ్ గా సోము వీర్రాజు
  • సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపిన కన్నా
  • ఇప్పటివరకు ఏపీ బీజేపీ చీఫ్ గా పనిచేసిన కన్నా
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బీజేపీ ఏపీ చీఫ్ గా సోము వీర్రాజు నియామకం నేపథ్యంలో కన్నా మాజీ అయ్యారు. ఈ నేపథ్యంలో కన్నా ట్వీట్ చేశారు.

"నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి నేతకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు, బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మరో ట్వీట్ చేశారు.
Kanna Lakshminarayana
BJP
Chief
Andhra Pradesh
Somu Veerraju

More Telugu News