వాడెవడో చైతన్య అట... నా పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్నాడు: సింగర్ సునీత ఆగ్రహం

28-07-2020 Tue 12:36
  • వీడియో రిలీజ్ చేసిన సునీత
  • వాడి ఉచ్చులో చిక్కుకోవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి
  • చైతన్య ఎవరో తనకు తెలియదని స్పష్టీకరణ
Singer Sunitha released a video about cheating

టాలీవుడ్ గాయని సునీత ఆగ్రహావేశాలతో కూడిన ఓ వీడియో విడుదల చేశారు. చైతన్య అనే యువకుడు తన పేరు చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిసిందని, వాడు తనకు కనిపిస్తే పళ్లు రాలగొడతానని హెచ్చరించారు. అనంతపురంకు చెందిన చైతన్య అనే యువకుడు సింగర్ గా చెప్పుకుంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని, వాడెవరో తనకు తెలియదని, వాడి వలలో చిక్కుకోవద్దని సునీత తన అభిమానులకు స్పష్టం చేశారు.

ఇంతవరకు వాడ్ని చూడలేదని, తన పేరు వాడుకుంటూ అమాయకులను మోసం చేస్తున్నాడని సునీత ఆరోపించారు. "నేను అతడికి బాగా సన్నిహితురాలినని ప్రచారం చేసుకుంటున్నాడు. సెలబ్రిటీల వద్ద కూడా నా గురించి చెప్పి వాళ్లతో పరిచయాలు పెంచుకుంటున్నాడట. ఇలాంటి వాళ్లు ఎలా మోసాలకు పాల్పడతారో? వాడ్ని వదిలేది లేదు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.