పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు: సోము వీర్రాజు

28-07-2020 Tue 12:18
  • పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు
  • నాకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తాను
  • పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను
Somu Veerraju thanks all party leaders for appointing him as AP BJP President

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును పార్టీ అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బీజేపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు తనకు అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.

'నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి , ప్రధానమంత్రి మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (org) శ్రీ బీఎల్ సంతోష్ గారికి మరియు మన కేంద్ర నాయకత్వంలోని ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాపై పెట్టిన ఈ బాధ్యతను నేను మనసా, వాచా, కర్మణ నిబద్ధతతో నిర్వహిస్తానని... పార్టీని జిల్లా, మండల, గ్రామ బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేస్తానని... అందరిని కలుపుకుంటూ పార్టీని ముందుకు తీసుకు వెళ్లడానికి నూరు శాతం కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు.