ధ‌నుష్ కొత్త సినిమా నుంచి ‘ర‌కిట ర‌కిట‌’ పాట విడుదల

28-07-2020 Tue 12:12
  • యంగ్ హీరో ధ‌నుష్ నటిస్తున్న 40వ సినిమా ‘జగమే తంత్రం’
  • అలరిస్తోన్న పాట లిరిక్స్
  • కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా
dhanush new movie song release

యంగ్ హీరో ధ‌నుష్ నటిస్తున్న 40వ సినిమా ‘జగమే తంత్రం’ నుంచి  ‘ర‌కిట ర‌కిట‌..’ పాట ఈ రోజు విడుదలయింది. ఈ సినిమాను త‌మిళంలో జ‌గమే తంతిర‌మ్ పేరుతో రూపొందిస్తున్నారు. ఇందులో ధనుష్ సరసన ఐశ్వ‌ర్య ల‌క్ష్మి న‌టిస్తోంది.

‘ర‌కిట ర‌కిట‌.. ఓ.. నేనెక్కడైనా ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటా.. తోడుగా నా ప్రాణం ఉంది.. ఇంకేం కావాలంటా’ అంటూ ఉన్న లిరిక్స్‌ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో వైనాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై శ‌శికాంత్  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి వెంక‌ట్ కాచ‌ర్ల డైలాగ్స్ రాస్తున్నారు.