నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్... వర్మకు జరిమానా వడ్డించిన జీహెచ్ఎంసీ

28-07-2020 Tue 11:17
  • ఇటీవలే పవర్ స్టార్ సినిమా రూపొందించిన వర్మ
  • లాక్ డౌన్ లో తొలి పోస్టర్ తనదేనంటూ ట్వీట్
  • ట్వీట్ ఆధారంగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసిన వ్యక్తి
GHMC fined director Ram Gopal Varma

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే పవర్ స్టార్ అనే సినిమాను రూపొందించి ఆన్ లైన్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నగరంలో పోస్టర్లు వేయించినట్టు ఫిర్యాదు రావడంతో, జీహెచ్ఎంసీ జరిమానా వేసింది.

లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటి పోస్టర్ తనదేనంటూ వర్మ చేసిన ట్వీట్ ను ఆధారంగా చేసుకుని ఓ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీ వర్మ నిబంధనలు అతిక్రమించాడని గుర్తించి 4 వేల రూపాయలు జరిమానాగా విధించింది. ఈ మేరకు చలానా జారీ చేసింది.