Hoarding: కరోనా మహమ్మారిని జయించాడంటూ కటౌట్లు!

  • కరోనాపై ప్రజల్లో భయాందోళనలు
  • కోలుకున్న వ్యక్తులను విజేతలుగా చూస్తున్న ప్రజలు
  • కరోనా నుంచి కోలుకున్న యువకుడికి భారీ కటౌట్ తో స్వాగతం
Hoardings for a corona survivor attracts attention of social media

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ బారిన పడడం అంటే ఓ విపత్తులోకి వెళ్లడమే అన్నట్టుగా ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే ఎవరైనా కరోనా నుంచి కోలుకున్నారంటే వారిని ఓ విజేతలా భావిస్తున్నారు.

తాజాగా, ఏపీలో ఓ యువకుడు కరోనా బారినపడి కోలుకున్నాడు. అతనికి స్వాగతం పలుకుతూ ఏకంగా భారీ కటౌట్ ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా రాజకీయ నాయకులు, సినిమా హీరోల కోసం ఏర్పాటు చేసే స్థాయిలో గ్రాఫిక్స్ జోడించి ఈ కటౌట్ తయారుచేశారు. సోషల్ మీడియాలో ఇది అందరి దృష్టి ఆకర్షిస్తోంది.

More Telugu News