విశాఖలో మరో ప్రమాదం... రసాయనాలతో కూడిన కంటైనర్లు దగ్ధం

27-07-2020 Mon 19:00
  • గేట్ వే సీఎఫ్ఎస్ కంటైనర్ యార్డులో అగ్నిప్రమాదం
  • క్రేన్ తో కంటైనర్ తరలిస్తుండగా రాపిడితో మంటలు
  • కంటైనర్లలో అల్యూమినియం ఫ్లోరైడ్ రసాయనం
Fire accident held at Gate Way CFS Container Yard in Vizag
ప్రశాంతతకు నెలవుగా చెప్పుకునే విశాఖపట్నంలో ఇటీవల వరుసగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా షీలా నగర్ సమీపంలోని గేట్ వే సీఎఫ్ఎస్ కంటైనర్ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. పలు కంటైనర్లు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. ఆ కంటైనర్లలో అల్యూమినియం ఫ్లోరైడ్ రసాయనం ఉన్నట్టు భావిస్తున్నారు.

ప్రమాదం నేపథ్యంలో దట్టమైన పొగలు, రసాయన పదార్థం వాసనలతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఓ కంటైనర్ ను తరలించే సమయంలో క్రేన్ ఒరిపిడికి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.