Nagarjuna: ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున కొత్త చిత్రం

Nagarjuna next movie finalised with Praveen Satharu
  • 'గరుడ వేగ' చిత్రంతో గుర్తింపు పొందిన ప్రవీణ్ సత్తారు
  • నాగ్ తో భారీ యాక్షన్ చిత్రానికి రెడీ
  • త్వరలోనే షూటింగ్ ప్రారంభం
కింగ్ నాగార్జున కొత్త చిత్రంపై స్పష్టత వచ్చింది. గతంలో 'గరుడ వేగ' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈసారి నాగార్జునతో సినిమా చేయబోతున్నాడు. నాగ్, ప్రవీణ్ కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లు ఓ భారీ యాక్షన్ చిత్రం ప్లాన్ చేశాయి. ఏషియన్ సినిమాస్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర తారాగణం వివరాలు మరికొన్నిరోజుల్లో వెల్లడికానున్నాయి.
Nagarjuna
Praveen Satharu
Action Movie
Tollywood

More Telugu News