కరోనా తర్వాత వదిలేది లేదన్న నిఖిల్... స్పందించిన నితిన్

27-07-2020 Mon 16:15
  • ఘనంగా నితిన్ వివాహం
  • నితిన్-షాలిని జోడీపై శుభాకాంక్షల జల్లు
  • పార్టీ ఇవ్వాల్సిందేనన్న నిఖిల్
  • తప్పకుండా ఇస్తాను అంటూ నితిన్ రిప్లై
Hero Nithin replies for Nikhil tweet about after wedding party

టాలీవుడ్ యువ హీరోల్లో ఒకడైన నితిన్ వివాహం షాలినితో గత రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా నితిన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మరో యువ హీరో, ఇటీవలే ఓ ఇంటివాడైన నిఖిల్ కూడా నితిన్ కు విషెస్ తెలిపాడు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ, తమకు నితిన్ పార్టీ బాకీ ఉన్నాడని, కరోనా తర్వాత వదిలేది లేదని ట్వీట్ చేశాడు. దీనికి నితిన్ స్పందించాడు. "థాంక్యూ బ్రో.. తప్పకుండా ఇస్తాను!" అంటూ బదులిచ్చాడు. ఆదివారం రాత్రి హైదరాబాదులో జరిగిన నితిన్ వివాహానికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరయ్యారు.