Raghurama Krishnaraju: చిరంజీవి కంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న జగన్ ఓ మంచి కార్యక్రమం చేపట్టాలి: రఘురామకృష్ణరాజు

Raghurama Krishnaraju says CM Jagan have more fans than Chiranjeevi
  • మాస్కుపై చిరంజీవి ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ
  • జగన్ కూడా అలాంటి ప్రచారాలే నిర్వహించాలని సూచన
  • జగనన్న పేరు ఉంటే అధికారుల్లో సీరియస్ నెస్ వస్తుందని వెల్లడి
ఏపీలో కరోనాపై అవగాహన కోసం కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, హీరో చిరంజీవి మాస్కులపై ప్రచారం చేస్తున్న తరహాలో సీఎం జగన్ కూడా ఏదైనా కార్యక్రమం చేపట్టాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. చిరంజీవి కంటే సీఎం జగన్ కే ఎక్కువమంది అభిమానులు ఉన్నారని, జగన్ కూడా వైరస్ పై పోరాటంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకు జగనన్న పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లోనూ ముందుండాలని అభిలషించారు. ఇప్పుడు కరోనా వైరస్ పై పోరాటానికి కూడా జగనన్న పేరు పెట్టాలని, 'జగనన్న కరోనా కేర్', లేకపోతే 'జగనన్న కరోనా వార్' అని పేరు పెడితే బాగుంటుందని వివరించారు. ఏదైనా పథకానికి ముందు 'జగనన్న' అనే పేరుంటే అధికారులు కూడా చురుగ్గా పనిచేస్తారని పేర్కొన్నారు.
Raghurama Krishnaraju
Jagan
Chiranjeevi
Corona Virus
Campaign
Andhra Pradesh

More Telugu News