వారికి ఇదే నా మొదటి, చివరి హెచ్చరిక: శ్రద్ధా దాస్

27-07-2020 Mon 15:44
  • త్వరలో బిగ్ బాస్ తాజా సీజన్ ప్రారంభం
  • బిగ్ బాస్-4లో శ్రద్ధా దాస్ అంటూ ప్రచారం
  • తనను ఎవరూ సంప్రదించలేదన్న శ్రద్ధ
Sradha Das responds to Bigg Boss participation news

త్వరలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం అవుతుంది అంటూ ఇప్పటికే టీజర్ రావడంతో ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షోలో పాల్గొనే హౌస్ మేట్లు ఎవరంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా బిగ్ బాస్-4లో సందడి చేయనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దీనిపై శ్రద్ధా దాస్ స్వయంగా స్పందించారు. బిగ్ బాస్ షోతో తన పేరు ముడిపెట్టి ప్రచారం జరుగుతోందని, వాస్తవాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని హితవు పలికారు. ఏదైనా గానీ నిర్ధారించుకున్న తర్వాతే రాయాలని, అవాస్తవాలు ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే నా మొదటి, చివరి హెచ్చరిక అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ షోలో చేయాలని తనను ఎవరూ సంప్రదించలేదని శ్రద్ధా దాస్ స్పష్టం చేశారు.