గవర్నర్ తీరుపై ప్రధాని మోదీతో మాట్లాడాను: అశోక్ గెహ్లాట్

27-07-2020 Mon 15:43
  • అసెంబ్లీని సమావేశ పరచాలనే విన్నపాన్ని గవర్నర్ తిరస్కరించారు
  • రాష్ట్రంలో రాజకీయ సంక్షోభంపై మోదీకి వివరించా
  • ఇలాంటి దారుణ పరిస్థితులు ఎన్నడూ లేవు
I spoke to  Modi says Ashok Gehlot

రాజస్థాన్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాలను అనుమతించాలంటూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన విన్నపానికి రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా మరోసారి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మీడియాతో గెహ్లాట్ మాట్లాడుతూ, కరోనా వైరస్ పై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని కోరితే గవర్నర్ తిరస్కరించారని చెప్పారు. నిన్న ఫోన్ ద్వారా మోదీతో మాట్లాడానని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభంపై, గవర్నర్ తీరుపై మోదీకి వివరించానని చెప్పారు. వారం క్రితం తాను రాసిన లేఖపై  కూడా చర్చించానని తెలిపారు. గత 70 ఏళ్లలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ లేవని అన్నారు.