Corona Virus: ఏపీలో ప్రైవేటు ల్యాబ్ లకు కరోనా పరీక్షల ధరలు నిర్ణయించిన ఆరోగ్య శాఖ

  • ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుకు రూ.750
  • ఆర్టీపీసీఆర్ టెస్టుకు రూ.2,800
  • ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు దరఖాస్తులు పంపాలని సూచన
AP health department fixes charges for corona tests in private facilities

ఏపీలో కరోనా పరీక్షల ధరలను నిర్ణయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి పంపే శాంపిళ్లు, ప్రైవేటు ల్యాబ్ లు సొంతంగా సేకరించే శాంపిళ్లకు ఈ ధరలు వర్తిస్తాయి. ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ లలో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలకు రూ.750 కంటే ఎక్కువ వసూలు చేయవద్దని ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ విధానంలో చేసే పరీక్షకు రూ.2,800 ధరను నిర్ణయించారు.

ర్యాపిడ్ కిట్, పీపీఈ కిట్లు, మానవ వనరుల వ్యయం అన్నీ కలుపుకునే ఈ ధరను నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రభుత్వంతో పాటు ఐసీఎంఆర్ కు కూడా పరీక్షల ఫలితాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  ఈ పద్ధతిలో, ఈ ధరలతో కరోనా పరీక్షలు చేయదలుచుకున్న ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్ లు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

More Telugu News