Bruno Dey: దాదాపు 5 వేల మంది ప్రాణాలు తీశాడు.. 93 ఏళ్ల వయసులో కోర్టు దోషిగా తేల్చింది!

  • రెండో ప్రపంచయుద్ధ సమయంలో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపు గార్డుగా ఉన్న డెయ్
  • అప్పటికి అతని వయసు 17 సంవత్సరాలు
  • శిక్షను పెండింగ్ లో ఉంచిన జర్మనీ కోర్టు
Ex Nazi guard Bruno Dey aged 93 convicted

నాటి జర్మన్ నియంత హిట్లర్ నిర్దాక్షిణ్యంగా కొనసాగించిన మారణకాండలో దాదాపు 65 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో నరమేధం జరిగింది. ఆ సమయంలో కాన్సట్రేషన్ క్యాంప్ గార్డుగా బ్రూనో డెయ్ అనే వ్యక్తి పని చేశాడు. ఈ మారణకాండలో అతను కూడా పాలుపంచుకున్నాడు. దాదాపు 5,232 మంది ప్రాణాలను బలిగొన్నాడు.

అప్పటికి అతని వయసు 17 సంవత్సరాలు. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత డెయ్ కి రెండు నెలల సస్పెన్షన్ విధించి... ఆ తర్వాత విధుల్లోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును సుధీర్ఘంగా విచారించిన జర్మనీ కోర్టు డెయ్ ని దోషిగా తేల్చింది. అతనికి విధించబోయే శిక్షను పెండింగ్ లో ఉంచింది. ప్రస్తుతం డెయ్ వయసు 93 సంవత్సరాలు.

More Telugu News