టాలీవుడ్ నిర్మాత కందేపి సత్యనారాయణ మృతి

27-07-2020 Mon 13:32
  • కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయిన సత్యనారాయణ
  • 40కి పైగా చిత్రాలను నిర్మించిన సత్యనారాయణ
  • సంతాపం ప్రకటించిన సినీ ప్రముఖులు
Tollywood producer Kandepi Satyanarayana dies with cardiac arrest

అసలే కరోనా కష్టాల్లో ఉన్న టాలీవుడ్ ను వరుస మరణాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. నిన్న సీనియర్ నటుడు మంచాల సూర్యనారాయణ గుండెపోటుతో మరణించారు. ఈ షాక్ నుంచి కోలుకోకముందే నిర్మాత కందేపి సత్యనారాయణ కన్నుమూశారు. నిన్న రాత్రి 8.50 గంటలకు కార్డియాక్ అరెస్ట్ కారణంగా బెంగళూరులో ఆయన మృతి చెందారు. మొత్తం 40కి పైగా చిత్రాలను సత్యనారాయణ నిర్మించారు. 'పాండురంగ మహాత్మ్యం' అనే డబ్బింగ్ సినిమా ఆయన తొలి చిత్రం. 'కొంగుముడి', 'దొరగారింట్లో దొంగోడు', 'శ్రీవారు' వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళంలో కూడా ఆయన పలు చిత్రాలను నిర్మించారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.