బీజేపీ ఎంపీ అనిల్ బలూనిని టీ తాగేందుకు ఆహ్వానించిన ప్రియాంక గాంధీ
- ఆగస్టు 1లోపు బంగళాను ఖాళీ చేయాలన్న కేంద్రం
- ఆమె బంగళా బీజేపీ ఎంపీకి కేటాయింపు
- గురుగ్రామ్‌కు మకాం మార్చనున్న ప్రియాంక
ప్రియాంక గాంధీ 1997 నుంచి ఢిల్లీలోని లోధీ ఎస్టేట్ బంగళాలోనే ఉంటున్నారు. ఆమెకు కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను కేంద్రం ఇటీవల ఉపసంహరించుకుంది. దీంతో బంగళాను ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు నోటీసులు పంపింది. దీంతో బంగళాను ఖాళీ చేస్తున్న ప్రియాంక హరియాణలోని గురుగ్రామ్‌కు తన నివాసాన్ని మార్చనున్నారు.