Naga shaurya: కండలు తిరిగిన దేహంతో విల్లు ఎక్కుపెట్టిన నాగశౌర్య.. కొత్త సినిమా ఫస్ట్‌లుక్ అదుర్స్

NarayanDas Jis Birthday here is the stunning FIRST LOOK of  Nagashaurya
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ యంగ్‌ హీరో నాగశౌర్య 20వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో నాగశౌర్య కండలవీరుడిగా కనిపించబోతున్నాడు. కండలు తిరిగిన దేహంతో, చేతిలో విల్లు ఎక్కుపెట్టి కనిపిస్తున్న నాగశౌర్య లుక్‌ అదిరిపోయింది.

జుట్టు, గెడ్డం కూడా బాగా పెంచేసి ఆయన కనపడుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను దర్శకుడు‌ శేఖర్‌ కమ్ముల తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌  పతాకాలపై నారాయణ్‌ దాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు, శరత్‌ మరార్‌  నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో అశ్వథ్థామ సినిమాతో నాగశౌర్య ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Naga shaurya
Tollywood

More Telugu News