సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

27-07-2020 Mon 07:41
  • ముద్దుసీన్ల గురించి పాయల్ 
  • బాలకృష్ణతో మళ్లీ కె.ఎస్.రవికుమార్  
  • నాని 'టక్ జగదీశ్' అప్ డేట్స్  
Payal about liplock kissing scenes

*  సినిమాల్లోని ముద్దు సీన్ల గురించి ముందుగానే తన తల్లితో డిస్కస్ చేస్తానని చెబుతోంది అందాలతార పాయల్ రాజ్ పుత్. 'సినిమా ఒప్పుకునే ముందే అందులోని ముద్దు సీన్ల గురించి, రొమాంటిక్ సీన్ల గురించి అమ్మకు చెబుతాను. నీకు కంఫర్ట్ బుల్ గా అనిపిస్తే చేసేయ్ అని అమ్మ సలహా ఇస్తుంది. అప్పుడే ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటాను' అని చెప్పింది పాయల్.  
*  నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గతంలో 'జైసింహా', 'రూలర్' వంటి జనరంజకమైన చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కలయికలో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల బాలకృష్ణను రవికుమార్ కలసి, కథ చెప్పడం జరిగిందని సమాచారం.  
*  నాని కథానాయకుడుగా నటిస్తున్న 'టక్ జగదీశ్' చిత్రం షూటింగ్ నలభై శాతం వరకు పూర్తయింది. లాక్ డౌన్ రావడంతో మిగతా షూటింగుకి బ్రేక్ పడింది. అయితే, ఈ లాక్ డౌన్ కాలంలో ఇంతవరకు జరిగిన షూటింగుకి సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేశారట. రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు.