Sonu Sood: సాఫ్ట్ వేర్ శారద ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్న సోనూ సూద్

Sonu Sood responds to software Sarada plight
  • ఆపద్బాంధవుడిలా మారిన సోనూ సూద్
  • సాఫ్ట్ వేర్ శారద కథనంపై స్పందన
  • తప్పకుండా సాయం చేస్తానని హామీ

సోనూ సూద్... సాయానికి పర్యాయపదంగా మారిన పేరిది! లాక్ డౌన్ సమయంలో వలసకార్మికులను ఆదుకోవడం నుంచి, ఇవాళ ఓ రైతుకు కొత్త ట్రాక్టర్ బహూకరించడం వరకు సోనూ సూద్ దాతృత్వానికి ఎల్లలు లేవని నిరూపితమైంది.

తాజాగా, వరంగల్ కు చెందిన సాఫ్ట్ వేర్ శారదపై మీడియాలో కథనానికి ఆయన స్పందించారు. లాక్ డౌన్ కారణంగా సాఫ్ట్ వేర్ జాబ్ కోల్పోయిన శారద స్వస్థలం చేరుకుని కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్న వైనం సోనూ సూద్ ను కదిలించింది.  ఈ నేపథ్యంలో మీడియా ద్వారా సాఫ్ట్ వేర్ శారద ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు. ఆమెతో మాట్లాడతానని, ఆమెకు తప్పకుండా సాయం చేస్తానని సోనూ వెల్లడించారు. శారద ఆత్మస్థైర్యాన్ని ప్రశంసించారు.

  • Loading...

More Telugu News