Kim Jong Un: దేశంలో తొలి కరోనా అనుమానిత కేసు రావడంతో ఎమర్జెన్సీ విధించిన కిమ్ జాంగ్ ఉన్

  • దక్షిణ కొరియా నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వ్యక్తి
  • కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం
  • వెంటనే పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసిన కిమ్
Kim Jong Un declared emergency after corona suspected person entered into country

ఇన్నాళ్లు కఠిన ఆంక్షలతో కరోనాను ఆమడదూరంలో నిలిపామని భావించిన ఉత్తర కొరియా కూడా చివరికి మహమ్మారి వైరస్ నుంచి తప్పించుకోలేకపోయింది. దేశంలో తొలి కరోనా అనుమానిత కేసు వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

కాగా, ఆ వ్యక్తి దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాలో అక్రమంగా చొరబడినట్టు భావిస్తున్నారు. ఆ వ్యక్తికి కరోనా ఉందన్న అనుమానాల దరిమిలా కిమ్ జాంగ్ ఉన్ వెంటనే పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే దేశంలో ఇదే తొలి కేసు కానుంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ప్రకటించిన కిమ్ సరిహద్దు నగరం కయసోంగ్ లో లాక్ డౌన్ ప్రకటించారు.

More Telugu News