Sonu Sood: సోనూ సూద్ పంపిన ట్రాక్టర్ చూసి మురిసిపోయిన రైతు కుటుంబం

Sonu Sood stands on his word and new tractor arrived the doorstep of Chittoor farmer
  • పొలం దున్నిన రైతు కుమార్తెలు
  • వీడియో చూసి కదిలిపోయిన సోనూ సూద్
  • సాయంత్రానికి ట్రాక్టర్ పంపి మాట నిలబెట్టుకున్న వైనం
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సామాన్యుడు కాదు! ఎక్కడో ముంబయిలో ఉండి కూడా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉన్న ఓ రైతు కుటుంబం బాధను గుర్తించి వారికి ఓ కొత్త ట్రాక్టర్ ఇవ్వడం మామూలు విషయం కాదు. అందుకే సోనూ సూద్ రియల్లీ గ్రేట్ అని చెప్పాలి.

సోనూ సూద్ ఎంత గ్రేటో ట్రాక్టర్ అందుకున్న రైతు కుటుంబ సభ్యుల కళ్లల్లో వెల్లివిరిసిన కృతజ్ఞతా భావమే చెబుతుంది... వారి ముఖాలపై విరబూసిన సంతోషమే చెబుతుంది. మధ్యాహ్నం ట్వీట్ చేశాడో లేదో సాయంత్రానికి ట్రాక్టర్ చిత్తూరు జిల్లాలోని ఆ రైతు ఇంటి ముంగిటకు వచ్చేసిందంటే సోనూ సూద్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని అర్థమవుతోంది.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ కూరగాయల రైతు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుమార్తెల సాయంతో పొలం దున్నడం చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించి ఓ ట్రాక్టర్ ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

Sonu Sood
Tractor
Farmer
Chittoor District
Andhra Pradesh

More Telugu News