Nara Lokesh: చిత్తూరు జిల్లా రైతుకు సోనూ సూద్ ట్రాక్టర్ సాయంపై నారా లోకేశ్ స్పందన

Sonu Sood ready to help a farmer and Lokesh appreciates the actor
  • పొలం దున్నిన చిత్తూరు జిల్లా రైతు కుమార్తెలు
  • వీడియో చూసి చలించిపోయిన సోనూ సూద్
  • రైతు కుటుంబానికి ట్రాక్టర్ ఇస్తానని ప్రకటన
  • అభినందించిన లోకేశ్
చిత్తూరు జిల్లా  మదనపల్లెకు చెందిన ఓ కూరగాయల రైతు పొలం దున్నేందుకు డబ్బు లేకపోవడంతో కుమార్తెలు అరక లాగుతుండగా పొలం దున్నడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఆ పేద రైతుకు ఓ ట్రాక్టర్ కొనిస్తానని ప్రకటించారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. కరోనా కష్టకాలంలో మీరు చేస్తున్న అద్భుతమైన సహాయ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా రైతు కుటుంబం పట్ల మీరు ప్రదర్శించిన సానుభూతి, దయ నిజంగా అభినందనీయం అంటూ ట్వీట్ చేశారు.
Nara Lokesh
Sonu Sood
Farmer
Chittoor District
Tractor

More Telugu News