చెవిలోనూ కరోనా... దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించిన శాస్త్రవేత్తలు!

26-07-2020 Sun 06:34
  • మృతులపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు
  • మస్టాయిడ్ లోనూ వైరస్ ఆనవాలు
  • వివరాలు వెల్లడించిన జేఏఎంఏ
New Study Revels Corona Virus in Ear

ఇప్పటివరకూ శరీరంలో కరోనా వైరస్ ఉంటుందని, దగ్గినా, తుమ్మినా బయటకు వచ్చి వ్యాపిస్తోందని భావిస్తున్న నేపథ్యంలో, శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించారు. తాజాగా అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలు, కరోనా చెవిలోపల, చెవి వెనుక భాగంలో ఉండే మస్టాయిడ్ (బోలు ఎముక)పైనా ఉందని వెల్లడించారు. ఈ స్టడీ వివరాలు జేఏఎంఏ (సైంటిఫిక్ జర్నల్ జామా) ప్రచురించింది.

వైరస్ సోకి మరణించిన ముగ్గురిపై పరీక్షలు చేసి, ఈ విషయాన్ని కనుగొన్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మృతదేహాల నుంచి మస్టాయిడ్లను, చెవుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేశామని తెలిపిన వారు, వైరస్ ఉనికిని కనుగొన్నామని తెలియజేశారు.