Prakash Raj: ఫాంహౌస్ లో ప్రకాశ్ రాజ్ ఫ్యామిలీ ఫొటోలు ఇవిగో!

Prakash Raj cycling with his family members at farm house
  • లాక్ డౌన్ ప్రకటన తర్వాత ఫాంహౌస్ లోనే ఉంటున్న ప్రకాశ్ రాజ్
  • తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి సైక్లింగ్
  • ఫాండైరీస్ అంటూ ట్వీట్
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఫాంహౌస్ లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఆయన తన ఫాంహౌస్ తాలూకు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా ఫాంహౌస్ వెలుపల తన కుటుంబ సభ్యులతో కలిసి సైక్లింగ్ చేస్తూ మరికొన్ని ఫొటోలు పోస్టు చేశారు. ఫాం డైరీస్ అంటూ ట్వీట్ చేశారు. "నా కుమారుడు, కుమార్తె, ప్రియాతి ప్రియమైన భార్యతో మా ఫాంహౌస్ వెలుపల సైక్లింగ్ చేశాను. అంతేకాదు, ఎంతో రుచికరమైన ఫొకేసియా పిజ్జా శాండ్ విచ్ లతో కాస్త ముందుగానే డిన్నర్ చేసేశాం.. ఇంతకన్నా పరమానందం ఇంకేముంటుంది!" అంటూ స్పందించారు.
Prakash Raj
Farm House
Cycling
Family
Lockdown

More Telugu News