Bikers: అమితాబ్ నివాసం ముందు బైక్ లపై కుర్రకారు హంగామా... పోలీసులు వచ్చేసరికి పారిపోతున్న వైనం!

Bikers creates nonsense at Amitabh house in Mumbai
  • కరోనాతో ఆసుపత్రిపాలైన అమితాబ్ కుటుంబ సభ్యులు
  • ఇంట్లోనే ఉంటున్న జయాబచ్చన్
  • బైకర్ల హల్ చల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన జయాబచ్చన్
ఓవైపు అమితాబ్ బచ్చన్ కుటుంబంలో సగం మంది కరోనాతో ఆసుపత్రిపాలవగా, ఇంట్లో ఉంటున్న జయాబచ్చన్ కు మరో సమస్య ఎదురైంది. ముంబయిలోని బిగ్ బి నివాసం ఎదుట కుర్రకారు బైక్ లపై నానా హంగామా చేస్తున్నారట. దీనిపై జయాబచ్చన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు అక్కడికి చేరుకునే సరికి ఆ యువకులు బైక్ లపై తుర్రుమంటున్నారట.

దీనిపై జుహూ పోలీస్ స్టేషన్ లో సీనియర్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న పీఎస్ వాహల్ మాట్లాడుతూ, రెండ్రోజుల కిందట జయాబచ్చన్ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారని, తమ సిబ్బంది ఆమె నివాసం వద్దకు చేరుకునే సరికి ఎవరూ కనిపించడంలేదని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా రోడ్లన్నీ ఖాళీగా ఉండడంతో బైకర్లు ఇలా రెచ్చిపోతున్నారని వివరించారు. అమితాబ్ నివాసంతో పాటు ఇరుగుపొరుగు ఇళ్ల సీసీటీవీ కెమెరా ఫుటేజి పరిశీలించి ఆకతాయిలను గుర్తిస్తామని వెల్లడించారు.
Bikers
Amitabh Bachchan
Jaya Bachchan
Police
Mumbai

More Telugu News