Mahesh Babu: మీ ప్లాస్మా కొందరి ప్రాణాలను కాపాడుతుంది: మహేశ్ బాబు

Mahesh Babu supports Plasma Donation campaign by Cyberabad Police
  • ప్లాస్మా దానం చేయండంటూ మహేశ్ ప్రచారం
  • సైబరాబాద్ పోలీసుల ప్రచారానికి మద్దతు
  • మీరూ ఓ ప్లాస్మా యోధుడు అవ్వండి! అంటూ పిలుపు
కరోనా రోగులకు చికిత్సలో విశేషంగా ఉపకరించే ప్లాస్మాను దానం చేయాలంటూ కరోనా నుంచి కోలుకున్నవాళ్లను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అర్థించారు. "ఇప్పుడు కావాల్సింది ప్లాస్మాయేనంటూ సైబరాబాద్ పోలీసులు ప్లాస్మా దానం గురించి ప్రచారం చేస్తున్నారు. కరోనాను జయించిన వ్యక్తులందరూ తమ ప్లాస్మాను దానం చేయాల్సిందిగా అర్థిస్తున్నాను. ముందుకొచ్చి ప్లాస్మా దానం ప్రక్రియలో పాలుపంచుకోండి. తద్వారా కరోనా రోగుల ప్రాణాలు కాపాడండి. మీరూ ఓ ప్లాస్మా యోధుడిగా నిలవండి!" అంటూ ట్విట్టర్ లో పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ ప్లాస్మా దానం ప్రచారానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు పలికారు.
Mahesh Babu
Plasma
Donation
Corona Virus
Cyberabad

More Telugu News