Nara Lokesh: తీసిన చోటే ఎన్టీఆర్ విగ్రహం మళ్లీ ఏర్పాటవుతుంది... ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట: నారా లోకేశ్

Nara Lokesh responds on NTR statue removal in Nellore district
  • నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు
  • అడ్డుకున్న టీడీపీ నేతలపై కేసులు!
  • బాధితులతో మాట్లాడిన నారా లోకేశ్
ఇటీవల నెల్లూరు జిల్లా కావలి వద్ద ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తుండగా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. దాంతో ఐదుగురు టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. బాధితులతో మాట్లాడానని, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చానని వెల్లడించారు. "తీసిన చోటే ఆ తారకరాముడి విగ్రహం మళ్లీ ఏర్పాటవుతుంది... ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Nara Lokesh
NTR
Statue
Kavali
Musunuru
Nellore District
Telugudesam

More Telugu News