Manikyala Rao: నాపై వస్తున్న వదంతులు నమ్మవద్దు: మాజీ మంత్రి మాణిక్యాలరావు

Manikyala Rao clarifies on his health
  • ఇటీవలే కరోనా బారినపడిన మాణిక్యాలరావు
  • మాణిక్యాలరావు ఆరోగ్యంపై అసత్య ప్రచారం
  • ఎవరూ నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేసిన మాణిక్యాలరావు 
మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు ఇటీవలే కరోనా బారినపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. దీనిపై మాణిక్యాలరావు స్వయంగా స్పందించారు. తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. ఎవరూ కంగారు పడవద్దు, అధైర్యపడవద్దు అంటూ ట్వీట్ చేశారు. భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి అభిమానంతో త్వరలోనే పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు.
Manikyala Rao
Corona Virus
Positive
Rumors
BJP
Andhra Pradesh

More Telugu News