North Korea: ఉత్తర కొరియాకు భారత్‌ సాయం.. టీబీ ఔషధాల సరఫరా!

  • ఉత్తర కొరియాలో క్షయ వ్యాధి నిరోధక ఔషధాల కొరత
  • సాయం చేయాలంటూ భారత్‌ను కోరిన డబ్ల్యూహెచ్‌వో
  • అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న భారత్
india helps north korea

ఉత్తర కొరియాకు భారత ప్రభుత్వం క్షయ వ్యాధి నిరోధక ఔషధాలను పంపనుంది. ప్రస్తుతం ఉత్తరకొరియాలో ఆ వ్యాధి సంబంధిత ఔషధాల కొరత నెలకొంది. దీంతో ఆ దేశానికి ఔషధాలు పంపి, సాయం చేయాలంటూ భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. ఆ వినతిపై భారత్ సానుకూలంగా స్పందించింది. సుమారు మిలియన్ డాలర్ల (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు) విలువైన టీబీ మందులను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేస్తూ ఉత్తరకొరియాలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వినతి మేరకు ఔషధాలను పంపుతామని చెప్పింది. కాగా, ఉత్తరకొరియాలో  ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

More Telugu News