Deepika Padukone: ఇంతకీ.. ప్రభాస్ సినిమాకి దీపిక పారితోషికం ఎంతట?

Deepika Padukones remuneration becomes big news in Tollywood
  • ప్రభాస్ 21వ చిత్రంలో బాలీవుడ్ భామ దీపిక
  • పెద్ద డిస్కషన్ అయిన పారితోషికం వార్త 
  • సుమారు ఇరవై కోట్లు తీసుకుంటున్న దీపిక  
ప్రభాస్ నటించే 21వ చిత్రంలో బాలీవుడ్ భామ దీపిక పదుకొణే కథానాయికగా ఎంపికైందంటూ అధికారికంగా వచ్చిన ప్రకటన ఒక పెద్ద న్యూస్ అయితే.. ఆ తర్వాత ఆమె తీసుకునే పారితోషికం విషయం మరో పెద్ద న్యూస్ అయింది.

గతంలో కొందరు నిర్మాతలు తెలుగులో నటింపజేయడానికి దీపిక కోసం ప్రయత్నించినప్పటికీ, అది సెట్ కాలేదు. ఈ నేపథ్యంలో 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే ఈ చిత్రంలో ఆమెను బుక్ చేయడం సంచలనమైంది. ఎందుకంటే, బాలీవుడ్ లో అగ్రతారగా బిజీగా వున్న దీపిక ఓ ప్రాంతీయ భాషా చిత్రానికి ఓకే చెప్పడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇక ఇప్పుడు ఆమె తీసుకునే పారితోషికం విషయమే పెద్ద డిస్కషన్ అవుతోంది. ఇప్పటివరకు హిందీలో ఆమె ఒక్కో చిత్రానికి 15 కోట్లకు కాస్త అటూ ఇటూగా తీసుకుంటున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. అయితే, తెలుగులో నటించడానికి మాత్రం ఆమె 25 కోట్లు తీసుకుంటోందని కొందరు.. కాదు.. 30 కోట్లని మరికొందరు .. ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజక్టుకి 20 కోట్ల పారితోషికానికి ఆమెను నిర్మాతలు ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏమైనా, ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ మాత్రం దీపిక పారితోషికం వార్తే!
Deepika Padukone
Prabhas
Nag Ashvin
Bollywood

More Telugu News