ఈ నెల 27న సీఎంలతో మోదీ భేటీ.. లాక్‌డౌన్‌ విధింపుపై చర్చ?

25-07-2020 Sat 11:09
  • భారత్‌లో కరోనా విజృంభణ
  • భారీ సడలింపులతో కొనసాగుతోన్న లాక్‌డౌన్‌
  • సీఎంల అభిప్రాయాలు తీసుకోనున్న మోదీ
modi video conference with cms

భారత్‌లో కరోనా విజృంభణ ఊహించని రీతిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క భారీ సడలింపులతో కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ గడువు ముగియనుండడంతో మరోసారి లాక్‌డౌన్‌ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది.

ఈ క్రమంలో ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభిప్రాయాలు తీసుకోనున్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, కట్టడి చర్యలు వంటి అన్ని అంశాలతో పాటు మరోసారి లాక్‌డౌన్‌ విధింపు గురించి ఆయన చర్చించనున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఆయన పలు సార్లు ముఖ్యమంత్రులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.