Uttar Pradesh: మరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను కాల్చి చంపిన యూపీ పోలీసులు

Wanted criminal tinku kapala killed in encounter
  • క్రిమినల్స్ ఏరివేతలో జోరు పెంచిన యూపీ పోలీసులు
  • ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన టింకూ
  • అతడి తలపై లక్ష రూపాయల రివార్డు
యూపీలో క్రిమినల్స్ కోసం వేట కొనసాగుతోంది. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్తుల ఏరివేతలో పోలీసులు జోరు పెంచారు. కరుడుగట్టిన నేరస్థుడు వికాశ్ దూబే ఎన్‌కౌంటర్ తర్వాత తాజాగా ఈ ఉదయం మరో క్రిమినల్‌ను పోలీసులు మట్టుబెట్టారు. పలు కేసుల్లో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ టింకూ కపాలా బారాబంకీ ప్రాంతంలో ఈ ఉదయం యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. టింకూ తలపై లక్ష రూపాయల రివార్డు ఉన్నట్టు ఎస్పీ అరవింద్ చతుర్వేది తెలిపారు.
Uttar Pradesh
criminal
Tinku kapala
enounter

More Telugu News