Karnataka: కర్ణాటకలో అరుదైన పాము.. తెలంగాణలో ఆఫ్రికా పక్షి!

Rare snake found in karnataka and african bird in Telangana
  • నల్లని శరీరంపై తెల్లని చారలతో పాము
  • విషపూరితం కాదన్న అధికారులు
  • కోస్గిలో గాయాలతో కనిపించిన ఆఫ్రికా వలస పక్షి
కర్ణాటకలో అరుదైన పాము, తెలంగాణలో ఆఫ్రికా నుంచి వలస వచ్చిన పక్షి అబ్బురపరిచాయి. బెళగావిలోని ఉద్యమ్‌బాగ్ పారిశ్రామికవాడలో నల్లటి శరీరంపై తెల్లటి చారలతో ఉన్న ఓ అరుదైన పామును గుర్తించారు. బ్రైడల్ పాముగా పిలిచే ఇలాంటి పాము కనిపించడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఈ పాములు రాత్రివేళల్లో మాత్రమే బయటకు వచ్చి ఆహారాన్ని వెతుక్కుంటాయని, ఈ పాములు విషపూరితం కాదని వివరించారు.

ఇక, తెలంగాణలోని నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఓ గుర్తు తెలియని వింత పక్షి స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. స్థానిక బ్రాహ్మణ వీధిలో గాయాలతో పడి ఉన్న దీనిని స్థానికులు రక్షించారు. దీని ముక్కు కోడి ముక్కును పోలి ఉన్నప్పటికీ పొడవుగా ఉంది. దీని పేరేంటో తెలియకపోయినప్పటికీ ఇది ఆఫ్రికా ఖండానికి చెందిన వలస పక్షి అని కోస్గికి చెందిన రిటైర్డ్ జంతుశాస్త్ర అధ్యాపకుడు చంద్రశేఖర్ తెలిపారు.
Karnataka
Telangana
Rare sanke
African bird

More Telugu News