YS Vivekananda Reddy: వైయస్ వివేకా మర్డర్ కేసు.. సీన్ రీకన్ స్ట్రక్ట్ చేస్తున్న సీబీఐ అధికారులు

  • ఈ ఉదయం వాచ్ మెన్ రంగన్న, కారు డ్రైవర్ ప్రసాద్ ను విచారించిన అధికారులు
  • ఆ తర్వాత వివేకా పీఏ కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల విచారణ
  • అందరి సమక్షంలో వివరాలను సేకరిస్తున్న అధికారులు
CBI is reconstructing the murder scene of YS Vivekananda Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 7వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం కడపలో ఉంటూ, రోజూ పులివెందుల వెళ్లి దర్యాప్తు చేసి వస్తున్నారు. వివేకా నివాసంలో వాచ్ మెన్ గా ఉన్న రంగన్నను నివాసంలోనే ఉండాలని నిన్న ఆదేశించిన సీబీఐ ఈరోజు విచారణ జరిపింది.

 రంగన్నతో పాటు కారు డ్రైవర్ ప్రసాద్ ను ఈ ఉదయం విచారించిన సీబీఐ అధికారులు... వివేకా పీఏ కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలను కూడా విచారించింది. వీరందరి సమక్షంలో వివరాలను సేకరిస్తోంది. విచారణ జరుపుతూ వివేకాను హత్య చేసిన ఇంట్లో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. సీబీఐ విచారణ నేపథ్యంలో పులివెందులలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.

More Telugu News