Selfie: ఉరకలెత్తే వరద నీటిలో సెల్ఫీ కోసం వెళ్లి చిక్కుకుపోయిన ఇద్దరమ్మాయిలు... కాపాడిన పోలీసులు!

Two girls tries to a selfie and stranded in river as police rescued
  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • విహారయాత్రకు వెళ్లిన అమ్మాయిలు
  • నీటిలో చిక్కుకుపోయిన ఇద్దరు అమ్మాయిలు
  • పోలీసుల తెగువతో ప్రాణాలు దక్కించుకున్న అమ్మాయిలు
సోషల్ మీడియా విస్తృతి పెరిగాక యువతలో సెల్ఫీలపై మోజు అధికమైంది. ఏ చిన్న సందర్భం అయినా సరే సెల్ఫీ ఉండాల్సిందే! కొన్నిసార్లు యువతీయువకులు సాహసోపేతమైన రీతిలో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇద్దరమ్మాయిలు ఇలాగే సెల్ఫీకి ప్రయత్నించగా, పోలీసుల రాకతో వారి ప్రాణాలు నిలిచాయి.

చింద్వాడాకు చెందిన ఆరుగురు అమ్మాయిలు జున్నార్ దియో ప్రాంతంలోని ఓ నది వద్దకు విహారయాత్రకు వెళ్లారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు నది మధ్యలో ఉన్న బండరాళ్లపై చేరి సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఇంతలో ఉద్ధృతమైన రీతిలో వరద నీరు నదికి పోటెత్తింది. దాంతో బయటికి వచ్చే వీల్లేక ఆ ఇద్దరు అమ్మాయిలు నది మధ్యలో చిక్కుకుపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాణాలకు తెగించి వారిద్దరినీ కాపాడారు. కాస్త ఆలస్యమైతే వాళ్లిద్దరూ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేదని పోలీసులు తెలిపారు.

Selfie
Girls
Police
River
Madhya Pradesh

More Telugu News