Sensex: భారీ నష్టాల నుంచి కోలుకుని.. స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 11 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 21 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • తీవ్ర ఒత్తిడికి గురైన బ్యాకింగ్ షేర్లు
Markets ends this week with losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని స్వల్ప నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 392 పాయింట్ల వరకు నష్టపోయింది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ అండతో మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుని చివరకు స్పల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 11 పాయింట్ల నష్టంతో 38,128 వద్ద ముగిసింది. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 11,194 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.29%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (4.15%), టెక్ మహీంద్రా (3.25%), సన్ ఫార్మా (1.95%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.61%).

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-3.32%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.23%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.66%), ఓఎన్జీసీ (-2.00%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.80%).

More Telugu News