CBI: మరోమారు వివేకా ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు

  • వివేకా హత్యకేసును విచారిస్తున్న సీబీఐ 
  • పులివెందులలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
  • నిన్న వాచ్ మన్ రంగన్నను విచారించిన సీబీఐ
 CBI officers goes to Viveka house in the part of investigation

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా సీబీఐ అధికారులు పులివెందులలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా మరోసారి వివేకా నివాసానికి వెళ్లి నిశితంగా పరిశీలించారు. వైఎస్ వివేకా కుమార్తె సునీత దగ్గరుండి సీబీఐ అధికారులకు వివేకా ఇంటి పరిసరాలను చూపించారు.

 కాగా, వివేకా హత్య సందర్భంగా ఓ గది తలుపులు తెరుచుకుని ఉందని సునీత సీబీఐ అధికారులకు తెలిపారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు వివేకా ఇంటిపైకి ఎక్కి కూడా శోధించారు. హత్య జరిగినట్టుగా భావిస్తున్న బెడ్రూం, బాత్రూంలలో క్షుణ్ణంగా పరిశీలించారు. నిన్న వివేకా ఇంటి వాచ్ మన్ రంగన్నను సీబీఐ అధికారుల బృందం విచారించిన సంగతి తెలిసిందే.

More Telugu News