Varla Ramaiah: ఇప్పటికైనా సీఎం భేషజాలకు పోకుండా రమేశ్ కుమార్ ను ఆహ్వానించాలి: వర్ల రామయ్య

Varla Ramaiah demands CM should invite Nimmagadda Ramesh Kumar
  • నిమ్మగడ్డ అంశంపై స్పందించిన వర్ల రామయ్య
  • సీఎం కక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడుతున్నారంటూ విమర్శలు
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. నిమ్మగడ్డ విషయంలో గవర్నర్ ఆదేశాలు అమలు చేయకుండా సుప్రీంకోర్టు తీర్పుకోసం వేచి ఉన్నట్టు చెప్పడం రాజ్యాంగ ధిక్కరణగా పరిగణించాలని పేర్కొన్నారు. నిమ్మగడ్డ అంశంలో సీఎం కక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి భేషజాలకు పోకుండా రమేశ్ కుమార్ ను ఆహ్వానించాలని వర్ల రామయ్య సూచించారు.
Varla Ramaiah
Nimmagadda Ramesh Kumar
Jagan
Andhra Pradesh
YSRCP

More Telugu News