కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్!

24-07-2020 Fri 12:21
  • నేడు కేటీఆర్ జన్మదినం
  • యూసుఫ్ గూడలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన టీఆర్ఎస్
  • హాజరైన తలసాని, పువ్వాడ, మాగంటి
TRS conducts mega blood camp on KTR birthday

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ రంగాలకు చెందిన పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తమ యువనేత పుట్టినరోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ శ్రేణులు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.  
హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో టీఆర్ఎస్ శ్రేణులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు.