Viral Videos: రోడ్డు పక్కన వృద్ధురాలి కర్రసాము విన్యాసం.. ఆమె ఎవరో చెప్పాలని వీడియో పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరో

 inspiring warrior Aaji Maa  incredible story says riteish
  • పొట్టకూటి కోసం విన్యాసం
  • జాలి పడి డబ్బు ఇస్తోన్న పాదచారులు
  • వివరాలు తెలుసుకున్న రితేశ్
  • ఆమెకు సాయం చేయడానికి సిబ్బందిని పంపిన నటుడు
రోడ్డు పక్కన ఓ వృద్ధురాలు కర్రసాము విన్యాసం ప్రదర్శించింది. పొట్టకూటి కోసం ఆ విన్యాసం ప్రదర్శిస్తుండడంతో జాలి పడి పలువురు ఆమెకు డబ్బులిచ్చారు. ఆ వృద్ధురాలి విన్యాసాల పట్ల బాలీవుడ్ నటుడు, జెనీలియా భ‌ర్త రితేశ్ దేశ్‌ముఖ్ ఆశ్చర్యపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్ చేస్తూ ఆమెకు సాయం చేస్తానని ప్రకటించాడు. ఆమె వివరాలు తెలపాలని ఆయన కోరాడు. దీంతో అది చూసిన కొందరు ఆ బామ్మ పేరు  శాంతాబాయి అని తెలిపారు. గ‌తంలో ఆమెకి తాము కూడా సాయం చేశామని చెప్పారు.

దీనిపై మరోసారి రితేశ్ స్పందిస్తూ.. శాంతాబాయ్‌కు సాయం చేసేందుకు త‌న సిబ్బందిని ఆమె వద్దకు పంపుతున్నానని చెప్పాడు. ఆమె స్టోరీ అసాధారణంగా ఉందని అన్నాడు. కర్రసాము విన్యాసం ప్రదర్శిస్తోన్న ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Viral Videos
Bollywood
Twitter

More Telugu News