డ్రైవర్‌కు కరోనా.. స్వీయ నిర్బంధంలోకి కేసీఆర్ కుమార్తె కవిత

24-07-2020 Fri 08:46
  • తెలంగాణలో కరోనా మహమ్మారికి పడని అడ్డుకట్ట
  • వరుసగా దాని బారినపడుతున్న ప్రముఖులు
  • వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన కవిత
kalvakuntla kavitha went to home isolation

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు దాని బారినపడుతూనే ఉన్నారు. డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ మహమ్మారి బారినపడ్డారు. తాజాగా, నిజామాబాద్ మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

ఆమె డ్రైవర్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు కవిత సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో 50 వేల మార్కును దాటేసింది. అలాగే, ఇప్పటి వరకు 447 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇంకా 11,052 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.