Karimnagar District: కరోనా సోకిందన్న అనుమానం.. విద్యాశాఖ సూపరింటెండెంట్ ఆత్మహత్య

  • కరీంనగర్‌లో ఘటన
  • మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా విధులు
  • ఐదు రోజులుగా జ్వరం, జలుబు
Govt employee suicide amid corona fear

కరోనా సోకిందన్న అనుమానంతో కరీంనగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన మామిడాల రాజా వెంకటరమణ (54) మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ భార్య, కుమారుడితో కలిసి అక్కడే ఉంటున్నారు. గత ఐదు రోజులుగా ఆయన జ్వరం, జలుబుతో బాధపడుతుండడంతో తాజాగా మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నారు. పరీక్షించిన వైద్యుడు ఎందుకైనా మంచిదని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు.

దీంతో తనకు కరోనా సోకి ఉంటుందని అనుమానించిన వెంకటరమణ ఆ రోజు సాయంత్రం వరకు విధులు నిర్వర్తించి, అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా నేరుగా కరీంనగర్‌లో తన ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం విధులకు వెళ్లిన తండ్రి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో అనుమానించిన ఆయన కుమారుడు విశ్వజిత్ కరీంనగర్‌లోని బంధువులకు ఫోన్ లో విషయం చెప్పాడు. వారు అతడి ఇంటికి వెళ్లి చూడగా వెంకటరమణ ఉరికి వేలాడుతూ కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News