Vanitha Vijayakumar: నటి వనిత విజయకుమార్‌పై విమర్శలు.. యువతి అరెస్ట్

police arrested a woman in actress vanitha vijaykumar case
  • వనిత మూడో పెళ్లిపై విమర్శల వెల్లువ
  • యూట్యూబ్ ద్వారా విరుచుకుపడిన సూర్యదేవి అనే యువతి
  • బెయిలు ఇప్పించిన నటి కస్తూరి
సినీ నటుడు విజయకుమార్- మంజుల దంపతుల పెద్ద కుమార్తె, సినీనటి, బిగ్‌ బాస్‌-3 ఫేమ్ వనితా విజయకుమార్‌పై విమర్శలు చేసిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనిత ఇటీవల పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్నారు. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్, నటి కస్తూరి, నిర్మాత రవీంద్రన్‌ వంటి వారు కూడా వనితపై విమర్శలతో విరుచుకుపడ్డారు. సూర్యదేవి అనే యువతి వనితపై విమర్శలు చేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేసింది. వీటిపై వనిత ఘాటుగానే స్పందించారు. అయినప్పటికీ ఆమె యూట్యూబ్ ద్వారా విమర్శలు చేస్తూనే ఉండడంతో వనిత ఆమెపై వడపళని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బుధవారం ఆమెను అదుపులోకి తీసుకోగా, గురువారం ఆమె బెయిలుపై విడుదలైంది.

సూర్యదేవికి బెయిలు రావడం వెనక నటి కస్తూరి హస్తం ఉంది. తన న్యాయవాది ద్వారా సూర్యదేవికి బెయిలు ఇప్పించినట్టు కస్తూరి స్వయంగా పేర్కొంది. సూర్యదేవి తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి మనసు గాయపరిచిందని, అయినప్పటికీ ఆమె పిల్లల క్షేమం కోరి ఆమె బెయిల్ కు తాను అభ్యంతరం చెప్పలేదని మరోపక్క వనిత విజయ్ కుమార్ పేర్కొంది. ఇప్పటికైనా ఆమె ఇలాంటి విమర్శలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
Vanitha Vijayakumar
kollywood
police case
Tamil Nadu

More Telugu News