శ్రావణమాసం పుణ్యమాని... రూ. 52 వేలు దాటేసిన 10 గ్రాముల బంగారం ధర!

24-07-2020 Fri 08:10
  • మొదలైన శుభకార్యాలు
  • పసిడికి పెరిగిన గిరాకీ
  • రూ. 52,400కు 10 గ్రాముల ధర
Gold Price Sores Record High

శుభకార్యాలు అధికంగా జరిగే శ్రావణమాసం మొదలైపోయింది. వివాహాలు జరుగుతూ ఉండటంతో బంగారం కొనుగోళ్లు జోరందుకోగా, ధర మరో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. నిన్న హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 52,400గా నమోదైంది.

 దేశంలో పసిడికి గిరాకీ పెరగడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కూడా ప్రభావం చూపుతున్నాయని బులియన్ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక దేశ రాజధానిలో బంగారం ధర రూ. 51,443కు చేరుకోగా, ముంబైలో రూ. 50,703గా నమోదైంది. ఇక, వెండి ధర సైతం బంగారంతో సమానంగా పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర రూ. 62,760 వద్ద కొనసాగుతోంది.