యాంకర్ విష్ణుప్రియ గురించి తెలియని రహస్యం చెప్పిన శ్రీముఖి!

24-07-2020 Fri 07:52
  • ఓ షోలో కలిసి పాల్గొన్న విష్ణుప్రియ, శ్రీముఖి
  • విష్ణుప్రియకు అఖిల్ అంటే పెళ్లాడేంత ఇష్టం
  • చేతిపై టాటూ కూడా వేయించుకుందన్న శ్రీముఖి
Srimukhi Reveal a secret About Vishnupriya

'పోరా పోవే' రియాల్టీ షోతో పాప్యులర్ అయిన యాంకర్ విష్ణుప్రియ, మరో యాంకర్ శ్రీముఖి మంచి ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో ఇద్దరూ కలిసి చాలా చోట్ల కనిపిస్తున్నారు. కలిసి డ్యాన్స్ లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు కూడా. తాజాగా విష్ణుప్రియ, శ్రీముఖి కలిసి మరో యాంకర్ ఝాన్సీ నిర్వహిస్తున్న టీవీషోకు హాజరయ్యారు. ఈ షోలో విష్ణుప్రియకు చెందిన ఎవరికీ తెలియని రహస్యాన్ని చెప్పాలని ఝాన్సీ కోరగా, శ్రీముఖి ఓ విషయాన్ని వెల్లడించింది.

ఇంతకీ అదేంటో తెలుసా? అక్కినేని వారసుడు అఖిల్ అంటే విష్ణుప్రియకు చెప్పలేనంత ఇష్టమట. అది ఎంత ఇష్టమంటే, పెళ్లి చేసుకోవాలనేంత. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై, ఏదైనా వరం కోరుకోమని అడిగితే, తనకు అఖిల్ తో పెళ్లి జరిపించమని కోరుతుందట. అంతేకాదు... తన చేతిపై అఖిల్ పేరు టాటూగా వేయించుకుందట విష్ణుప్రియ.