Flipkart: వాల్ మార్ట్ ఇండియా హోల్ సేల్ వ్యాపారాన్ని చేజిక్కించుకున్న ఫ్లిప్ కార్ట్

  • వాల్ మార్ట్ ఇండియాలో 100 శాతం వాటాలు కొనుగోలు
  • ఆగస్టులో ఫ్లిప్ కార్ట్ హోల్ సేల్ ప్రారంభం
  • జియో మార్ట్ కు దీటుగా ఫ్లిప్ కార్ట్ వ్యూహాత్మక ముందడుగు
Flipkart bought Wallmart India Hole sale business

ఇటీవలే ఈ-కామర్స్ విపణిలోకి జియో మార్ట్ రంగప్రవేశం చేసిన నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ వ్యూహాత్మక ముందడుగు వేసింది. వాల్ మార్ట్ ఇండియా హోల్ సేల్ వ్యాపారాన్ని చేజిక్కించుకుంది. వాల్ మార్ట్ ఇండియాలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసిన ఫ్లిప్ కార్ట్ త్వరలోనే 'ఫ్లిప్ కార్ట్ హోల్ సేల్' ను ప్రారంభించనుంది. ఆగస్టులో ఇది అందుబాటులోకి రానుంది.

మొదట నిత్యావసరాలు, ఫ్యాషన్ ఉత్పత్తులతో ఫ్లిప్ కార్ట్ హోల్ సేల్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త డిజిటల్ ప్లాట్ ఫాంతో తమ స్థానం మరింత సుస్థిరం అవుతుందని ఫ్లిప్ కార్ట్ భావిస్తోంది. ఫ్లిప్ కార్ట్ హోల్ సేల్ ద్వారా లాజిస్టిక్స్, ఫైనాన్స్, టెక్నాలజీ తదితర వనరులను చిన్న వ్యాపారాల సంస్థలకు కూడా విస్తరిస్తామని ఫ్లిప్ కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి వెల్లడించారు.

More Telugu News