విదేశీ గడ్డపై ఉన్న భారత విద్యార్థుల కోసం స్పైస్ జెట్ తో చేతులు కలిపిన సోనూ సూద్
- కిర్గిజ్ స్థాన్ లో చిక్కుకుపోయిన 1500 మంది విద్యార్థులు
- విద్యార్థులను తరలించేందుకు సోనూ, స్పైస్ జెట్ కార్యాచరణ
- ఇప్పటికే ఢిల్లీ నుంచి బయల్దేరిన 9 విమానాలు
తాజాగా, విదేశాల్లో చిక్కుకున్న భారత విద్యార్థులను తరలించేందుకు సిద్ధమయ్యాడు. కిర్గిజ్ స్థాన్ లో ఉన్న 1,500 మంది భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు సోనూ సూద్ ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తో చేతులు కలిపాడు. ఈ విషయాన్ని స్పైస్ జెట్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
"ఇది చారిత్రాత్మకమైన రోజు. రియల్ లైఫ్ హీరో సోనూ సూద్ తో భాగస్వామ్యం కుదిరింది. జీవితంలో ఒక్కపర్యాయం మాత్రమే సంభవించే ఓ భారీ తరలింపుకు శ్రీకారం చుడుతున్నాం. కిర్గిజ్ స్థాన్ లో చిక్కుకుపోయిన 1,500 మంది భారత విద్యార్థులను వారి కుటుంబాల వద్దకు చేర్చే బృహత్తర కార్యక్రమం ఇది. ఈ తరలింపు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 9 విమానాలు ఢిల్లీ నుంచి బయల్దేరాయి" అని స్పైస్ జెట్ వెల్లడించింది.