బస్సులకు వేసిన గులాబీ రంగును మార్చాలంటూ కేసీఆర్ ఆదేశాలు!

23-07-2020 Thu 17:04
  • మహిళల కోసం బయో టాయిలెట్ బస్సులు
  • కేటీఆర్ సూచనతో బస్సులకు గులాబీ రంగులు
  • రంగులు మార్చాలని మంత్రిని ఆదేశించిన కేసీఆర్
KCR Orders to change colour of Bio Toilet Busses

మహిళల ఇబ్బందులను తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బయో టాయిలెట్ బస్సులను ప్రవేశపెడుతోంది. అయితే ఈ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కు ఫోన్ చేసి పలు సూచనలు చేశారు. మహిళలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో బయో టాయిలెట్ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని... వీటిపై గులాబీ రంగు వద్దని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సూచనల మేరకు గులాబీ రంగులను వెంటనే మార్చాలని అధికారులను పువ్వాడ ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సూచనల మేరకే గులాబీ రంగు వేశామని నిన్న పువ్వాడ ప్రకటించారు. ఒకరోజు వ్యవధిలోనే రంగులు మార్చాలని కేసీఆర్ ఆదేశించడం ఆసక్తికరంగా మారింది.